రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన యూరియా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మానుక లక్ష్మణ్ యాదవ్ మూడు సార్లు తీసుకెళ్లి ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సరికాదని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మానుక లక్ష్మణ్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేశారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు గురువారం ఎస్సై రాహుల్ రెడ్డికి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో గోదాం వద్ద యూరియా కోసం వచ్చిన రైతుల సమక్షంలోనే అందరూ చూస్తుండగ