నంద్యాల జిల్లా అవుకు మండలం సుంకేసుల గ్రామంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూలు బస్సు ఢీకొన్న ఘటనలో మహిధర్ అనే మూడేళ్ల చిన్నారి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఎర్రబెల్లి శ్రీనివాసులు మీనాక్షి దంపతులకు ఇద్దరు కూతుర్లతో పాటు చివరి సంతానంగా జన్మించిన ఒకే ఒక కుమారుడు మృత్యువాత పడి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషయయాలు అలముకున్నాయి .పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు