శాంతిపురం మండలం శివరాంపురం పంచాయతీ గట్టూరు దళితవాడలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన రెండు రోజులుగా శాంతిపురం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు గట్టూరు వర్షపు నీరు ఇళ్లలో చేరడంతో పిల్లాపాపలతో తాము ఎలా ఉండాలంటూ మహిళలు వాపోతున్నారు. వర్షపు నీరు పోయేందుకు డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో నీళ్లు ఇళ్లలోకి చేరింది.