నంద్యాలలో ఆటో ఓనర్లు బాడుగకు ఇచ్చే సమయంలో డ్రైవర్ల పూర్తి విషయాలు కనుక్కొని ఇవ్వాలన్న 3 టౌన్ సిఐ కంబగిరి రాముడు నంద్యాల పట్టణంలో ఆటో ఓనర్లు ఆటోలను బాడుగకు డ్రైవర్లకు ఇచ్చే సమయంలో డ్రైవర్ల గురించి పూర్తిగా తెలుసుకొని బాడుగకు ఇవ్వాలని త్రీటౌన్ సిఐ కంబగిరి రాముడు బుధవారం మీడియా తెలిపారు. ఎక్కువగా నేర చరిత్ర కలిగిన డ్రైవర్లు ఆటోలను బాడుగలు తీసుకొని నడుపుతూ రాత్రి వేళల్లో వివిధ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎవరైనా ఆటో డ్రైవర్లు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే అందుకు సంబంధించిన ఓనర్లపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు