జిల్లాల పునర్విభజనలో భాగంగా పలనాడు జిల్లాకు పల్నాడు గుర్రం జాషువా జిల్లాగా నామకరణం చేయాలని పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక సభ్యులు శనివారం సాయంత్రం 6 గంటలకు సమయంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని తమ కార్యాలయంలో కమిటీ కార్యదర్శి షేక్ షరీఫ్ మాట్లాడుతూ వినుకొండలో జన్మించిన గుర్రం జాషువా తన కవితలతో కవి చక్రవర్తిగా పేరు పొందారని పేర్కొన్నారు. జిల్లా పేరు మార్పు కోసం ఎంపీ కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే ఎరపతినేని తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు.