ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగలి గ్రామంలో ఐదవ తరగతి చదువుతున్న ఐదు మంది విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మరణించడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు గారు తెలియజేశారు. గురువారం ఉదయం 12 గంటలు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నామని చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల కడుపు కోత తీర్చలేనిదని, తల్లిదండ్రులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నామన్నారు.