నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా పేటలో బుధవారం గణేష్ ధార్మిక సంఘం ఏర్పాటు చేసిన భారీ వినాయకుని విగ్రహం, భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది, లక్ష రూపాయల వ్యయంతో హైదరాబాదు నుంచి తెప్పించిన ఈ వినాయకుడు మూసి తెరవడం విశేషంగా ఆకట్టుకుంటుంది, భక్తులు హాజరై పూజలు నిర్వహిస్తున్నారు వినాయక చవితి సందర్భంగా ఐదు రోజులపాటు విస్తృతంగా వినాయకుడికి పూజ కార్యక్రమాలు జరగనున్నాయి.