సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోదండరాం నగర్ లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భార్య చిట్టి ఆమె ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. భార్యను పోలీసులు అదుపులోకి తీసుకోగ ఒక ఆమె ప్రియుడు పరార్ లో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.