గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ను భర్తరఫ్ చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఉదయం 12 గంటలు కర్నూలు కొత్త బస్టాండ్, కార్మిక కర్షక భవన్ వద్ద ఉన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజలకు అండగా నిలవాల్సిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కమీషన్లకు కకృతి పడి రైతుల భూములను ఏదేచ్ఛగా సోలార్ కంపెనీకి అప్పజెప్పడానికి పూనుకున్నారన్నారు. రైతుల పక్షాన గుత్తి మండలం దాచేపల్లికి వెళ్లిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డిని ఫోన్లో ఏక వ