శుక్రవారం జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ జిల్లాలో పలు తనిఖీల నిర్వహించారు మద్దిపాడు మండలం, సీతారామపురం లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ను తనికీ చేశారు. కాలుష్యం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని బంక్ యజమానులకు తెలియజేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ట్యాంకుల్లో నిల్వ ఉంచిన పెట్రోల్, డీజిల్ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం జరిగింది. పెట్రోల్ బంక్ లో గాలి, నీరు, బాత్ రూమ్ తదితర ఏర్పాట్లును పరిశీలించడం జరిగింది. తదుపరి మద్దిపాడు మండల కేంద్రంలో గల రేషన్ షాప్ ను సందర్శించి రేషన్ స్టాక్ రిజిస్టర్స్ ను బియ్యం నాణ్యతను, స్టాక్ ను పరిశీలించారు.