గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశువులకు ముందస్తు టీకాలు వేయించాలని భీమడోలు పశువైద్యశాల AD డా.ఇక్కుర్తి సాయిరమేశ్ శనివారం సాయంత్రం తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం నుంచి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ఉచితంగా వేస్తున్నామని చెప్పారు. పాడిరైతులు తమ గోజాతి, గేదె జాతి పశువులకు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు