కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పిఆర్సి కమిటీలో ఉద్యోగులకు జీతాలు పెంచాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదులమూడి మధుబాబు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని భారత్ పేట లోగల మదర్ థెరీసా కమ్యూనిటీ హాలులో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు సుమన్, సంగీతరావు, కిరణ్ పలువురు నాయకులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. సందర్భంగా మీడియాతో మధుబాబు మాట్లాడారు.