మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నీలం కమలమ్మ(50), ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుమారుడు నీలం సంపత్ కుమార్ ఈ విషయం తెలుసుకొని కీసర పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.