ఆదిలాబాద్ పట్టణంలోని సినిమా రోడ్డులో గల పలు బ్రాండెడ్ షోరూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి జాకీ, ముఫ్టీ, డేనిమ్ షోరూమ్ ల యజమానులు షాప్ లను మూసివేసి ఇంటికి వెళ్లగా కొద్దీ సేపటికే షాప్ లో నుంచి పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయి. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలం చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది షట్టర్లన్ పగలగొట్టగా, లోపలి నుండి మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను పెను ప్రమాదం తప్పింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న డిఎస్పి జీవన్ రెడ్డి తో పాటు పలువురు సీఐ లు ప్రమాదంపై అరా తీశారు