శ్రీకాళహస్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శ్రీకాళహస్తిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. బృందమ్మ కాలనీలో రూ.16 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణం, ప్రాజెక్టు వీధిలో రూ. 60 లక్షల వ్యయంతో కాలువలు, డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో వర్షం వస్తే ఇళ్లలోకి నీరు చేరేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.