సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం టేకూర్ గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుజిత్ తెలిపారు. సోమవారం రాత్రి టేకూర్ గ్రామంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారంతో సిబ్బంది తో కలిసి పేకాట శిబిరంపై దాడి నిర్వహించి, నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5745 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.