హైదరాబాద్ జిల్లా: మూసీ నదిలో అనుమానస్పదంగా కొట్టుకు వచ్చిన మృతదేహం కేసును అంబర్పేట్ పోలీసులు సోమవారం ఛేదించారు. ఈ సందర్భంగా అంబర్పేట్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం వైర్లు చుట్టి హత్య చేసినట్లుగా గుర్తించి హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మహమ్మద్ జావిద్(27), మహమ్మద్ అమిరుల్ హాక్ ,షారబ్(30), ముగ్గురు స్నేహితులు మృతుడి భార్యపై కన్ను వేసి హతమార్చి మూసిలో పడేశారని తెలిపారు.