రెండు నెలల నుంచి యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని బీఆర్ఎస్ లింగాపూర్ మండలం సోషల్ మీడియా కన్వీనర్ జాటోత్ రాహుల్ అన్నారు. సోమవారం లింగాపూర్ మండల కేంద్రంలో ధర్నా చేపట్టి మాట్లాడారు...అసమర్థ వద్దు కాంగ్రెస్ ప్రభుత్వం నాటి రోజులు తీసుకువస్తానంటే ఏమో అనుకున్నాం అన్నారు. యూరియా కోసం ప్రజలు చెప్పులు లైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇవేనా ఆ రోజులు అని విమర్శించారు. వైన్స్ షాపుల్లో మద్యం దొరుకుతుంది కానీ రైతులకు యూరియా దొరకడం లేదన్నారు.