అయినవిల్లి మండలం పరిధిలోని అయినవిల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విగ్నేశ్వర స్వామి వారిని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనాలు అందించారు.