అనంతపురం జిల్లా బెలుగుప్ప వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో టీ వీరపురం గ్రామానికి చెందిన పెద్దన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. టి వీరపురం గ్రామం నుంచి బెలుగుప్పకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా బెలుగుప్ప సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి 108 సాయంతో తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.