ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం మడకం వారి గూడెంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.. ఆయా గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఆయుధ డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది పోలీస్ సెక్షన్ 30 అదేవిధంగా 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి పాదయాత్రలు ర్యాలీలు సమావేశాలు పోలీస్ అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.