వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గ్రామంలో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన నిందితుడు మహేందర్ రెడ్డి ఇంటి ముందు మృతురాలి తల్లి బందువుల తో కలిసి ధర్నా నిర్వహించారు. నా కూతురును చంపిన మహేందర్ రెడ్డిని కూడా చంపితేనే నాకు మనశ్శాంతి కలుగుతుందని, కచ్చితంగా వాణ్ని చంపుతామని లేదంటే నేను చచ్చిపోతాను అంటూ మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.