కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4:00 సమయంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగిన గురజాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడటం జరిగింది. గత ఐదు ఏళ్ళు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిందని విమర్శించారు పచ్చజెండా మోసే వారికి పార్టీలో పదవులు ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటున్నామని తెలిపారు.