ఏపీ దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని దూదేకుల కులస్తులకు ఇవ్వకుండా ముస్లింలకు ఎలా ఇస్తారని దూదేకుల కులస్తులు ప్రశ్నిస్తున్నారు.గుత్తిలో మంగళవారం దూదేకుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షాషావలి,సీనియర్ నాయకులు ఖాజా,చాంద్ బాషా తదితరులు మాట్లాడారు.దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని బేతాపల్లి గ్రామం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన బర్ది వలికి ఇచ్చారన్నారు.ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.దూదేకుల కోసమే ప్రత్యేకంగా దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. గుంతకల్ నియోజకవర్గంలో 20 వేల దూదేకుల కులస్తులు ఉన్నారన్నారు.దూదేకుల కులస్తునికే డైరెక్టర్ పదవి ఇవ్వాలన్నారు