ప్రకాశం జిల్లా దోర్నాల మండలం లో కురుస్తున్న వర్షాలకు ఐనముక్కుల గ్రామంలోని పలు వీధులు జలమయమయ్యాయి. దీంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎమ్మార్వో ఎంపీడీవో పోలీసులు అక్కడికి చేరుకొని జెసిబి సహాయంతో కాలువలు తీయించి నీరు పోయాలా ప్రయత్నం చేశారు. తమ సొంత స్థలాలలో కాలువలు తీయనియ్యమంటూ పలువురు జెసిబి కి అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.