కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు ఇందిరా మార్కెట్లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మాజీ వార్డు కౌన్సిలర్ లవణ్య శరత్ మాట్లాడుతూ కమల్ కిషోర్ బాంగు ఇంటి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా సిమెంటు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు,