బాలిక హత్య కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బాలిక తల్లిదండ్రులు రేణుక, కృష్ణలను విచారించేందుకు పోలీస్ స్టేషన్కు పిలిపించారు. కుటుంబ సభ్యులతో కలిసి రేణుక స్టేషన్కు చేరుకుంది. మరికొద్ది సేపట్లో బాలనగర్ డిసిపి సురేష్ కుమార్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కు రానున్నట్లు సమాచారం. గత ఐదు రోజులుగా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా తల్లిదండ్రులను స్వయంగా డీసీపీ విచారించనున్నారు.