కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకేరోజు 91 మందికి కామారెడ్డి జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శిక్షలను విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లాలో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రధాన కారణాలు అవుతున్నట్లు తెలిపారు కొన్నిసార్లు మద్యం సేవించి వాహనం నడిపిన వారు స్వయంగా ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నట్లు తెలిపారు.