కాగజ్ నగర్ పేపర్ మిల్లులో వరస ప్రమాదాలు జరుగుతున్నపటి, ప్రమాదాలను బయటకు చెప్పనివ్వకుండా పేపర్ మిల్ యాజమాన్యం కార్మికులను భయబ్రాంతులకు గురి చేస్తుందని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని CPM కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..కార్మికులకు గాయాలైనప్పటికీ విషయం బయటికి రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. మిల్లుల నుంచి విపరీతంగా కాలుష్యం వస్తుందని వాపోయారు. దీంతో KZR పట్టణ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు.