ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్వహించిన సూపర్ సిక్స్- సూపర్ హిట్ ఘన విజయం సాధించిందని రాష్ట్ర మాదిగ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు.గురువారం మధ్యాహ్నం 12:30 గంటల సమయం లో నగరంలోని పెన్నార్ భవన్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కార్పొరేషన్ నిధులన్నీ నవరత్నాలకు మళ్లించారని అన్నారు. విదేశీ విద్య ఆపేసి, అంబేద్కర్ విదేశీ విద్య పేరును జగనన్న విదేశీ విద్యగా మార్చారని అన్నారు. సూపర్ హిట్ సభలో ప్రభుత్వాన్ని పాలించే పాలకులు పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు.