నల్లగొండలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో 22 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విద్యారంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా విప్లవాత్మక మార్పు ప్రారంభమైంది అన్నారు. పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడగలరని లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ లైబ్రరీలు స్పాట్ బోర్డులు ఆధునిక విద్యా బోధన ఉంటుందన్నారు