గడచిన 24 గంటలలో జిల్లా వ్యాప్తంగా 59.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శనివారం ప్రకటనలో వెల్లడించారు. అత్యధికంగా నిర్మల్ గ్రామీణ మండలంలో 12.6, కుబీర్ 12.0, బాసర 11.4, ఖానాపూర్ 10.2, నిర్మల్ పట్టణం 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. జిల్లాలో రాబోయే 24 గంటలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు.