నంద్యాల జిల్లా బేతంచెర్ల, డోన్ పట్టణాలలో భారీ ప్రభుత్వ పరిశ్రమలు ఏర్పాటు చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని DYFI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత వలసలు వెళ్తున్నారని, ఉపాధి, ఉద్యోగాలు కల్పించి వలసలను ఆపాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం ఉపాధి ట్రైనింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో DYFI జిల్లా అధ్యక్షుడు మధు శేఖర్ పాల్గొన్నారు.