శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి గోకులం సమీపంలోని డాక్టర్ రావు రోడ్డులో బుధవారం తెల్లవారుజామున ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది. రోడ్డులో భారీ కొండచిలువ కనిపించడంతో జనం పరుగులు తీశారు. అనంతరం తేరుకుని విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేయడంతో అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను బంధించారు. కొండచిలువను సురక్షితంగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కొండచిలువ కనిపించిన ప్రాంతానికి సమీపంలోనే ఎద్దుల కొండ ఉండడం తో మేత కోసం ఈ భారీ సర్పం ఇక్కడికి వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.