ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో కొందరు యువకులు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా చర్చికి ఆనుకొని వినాయకుని ప్రతిష్టించ వద్దని చర్చి నిర్వాహకులు పేర్కొనడంతో ఇరువురి మధ్య గొడవ నెలకొంది. దింతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువురిని సముదాయించారు.