పెద్దపప్పూరు మండలంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం పర్యటించారు. శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి క్షేత్రంలో స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు సుధీర్ శర్మ, బాల సుబ్రహ్మణ్యం, ఈవో సుబ్రహ్మణ్యం సన్మానించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామ ప్రజలతో దేవస్థానం అభివృద్ధిపై చర్చించారు.