కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి మాయమైందని పరిశుద్ధం పడకేసిందని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ శుక్రవారం ప్రకటనలో విమర్శించారు ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి ట్రాక్టర్ ట్రాలీల కొనుగోలు తో గ్రామాల్లో ఇంటింటికి చెత్త సేకరించేవారని అన్నారు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని దీంతో వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను గురవుతున్నారని అన్నారు