బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒక ఫంక్షన్ ముగించుకొని అన్నదమ్ములు యాక్టివా పై ఇంటికి తిరిగి వెళుతుండగా, ఐడీపీల్ సబ్స్టేషన్ సమీపంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ వారి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్న పార్సి రోహిత్ అక్కడికక్కడే మృతిచెందగా, తమ్ముడు పార్సి నితిన్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.