కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ చౌరస్తా వద్ద సోమవారం రాత్రి 9గంటలకు ఓ దొంగను పట్టుకొని చితకబదారు స్థానికులు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భగత్ నగర్ లో రాత్రి సమయాల్లో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని తెలిపారు. భగత్ నగర్ లోని ఓ ఇంటికి సంబంధించిన డ్రైనేజీ చాంబర్ లు ఎత్తుకెళ్తున్న దొంగను పట్టుకున్న స్థానికులు అతని వద్ద నుంచి ఆ ఇంటికి సంబంధించిన డ్రైనేజీ చాంబర్లను స్వాధీనం. అయితే గతంలో కూడా ఇలానే దొంగతనం చేశాడని దొంగను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పే ప్రయత్నం లో ఆ దొంగ తప్పించుకొని పారిపోయాడు. భగత్ నగర్ లో తరచూ ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు నిఘా పెంచాలన్నారు.