పలు సామాజిక మాధ్యమాల్లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్పై మానవ హక్కుల సంఘం సీరియస్ కేసు నమోదు అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల ఒక ప్రకటనలో ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మహబూబాబాద్ జిల్లా మరిపెడలో యూరియా కోసం లైన్లో నిలబడ్డ లక్క అనే రైతు కిందపడడంతో గాయాలయ్యాయని అందుకు మానవ హక్కుల సంఘం సీరియస్ అయి కేసు నమోదు చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని సదరు రైతు అనారోగ్య కారణాలతోనే తూలి కిందపడ్డాడని సీసీ కెమెరా ఫుటేజ్ ను విడుదల చేశారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.