ప్రకాశం జిల్లా సంతనూతలపాడు టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ప్రాంతంలోని సమస్యలపై ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.