యాదమరి మండలంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ప్రతిష్ట, మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా స్థానిక పోలీసు అనుమతి తీసుకోవాలని ఎస్సై ఈశ్వర్ తెలిపారు. ఆన్‌లైన్‌లో ganeshutsav.net ద్వారా NOC పొందాలని, పందిళ్ల వద్ద అగ్నిమాపక జాగ్రత్తలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. DJలు, మద్యం, అసభ్యకర ప్రవర్తన నిషేధమని, ఉత్సవ కమిటీలు పూర్తి బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పు అన్నారు