యాడికి మండలం రాయల చెరువు గ్రామానికి చెందిన రంగస్వామి కుమారుడు రాకేష్ (19) అనే యువకుడు అతిగా మద్యం సేవించి మృతి చెందాడు. రాకేష్ తన స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి గుంతకల్ కు వెళ్లాడు. అక్కడ వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని రాయల చెరువుకు వచ్చారు. మద్యం ఫుల్లుగా సేవించడం వల్ల రాకేష్ ఇంటికి వెళ్లకుండా ఓ షాపు వద్ద నిద్రించాడు. నిద్రలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై మంగళవారం సిఐ వీరన్న విచారణ చేపట్టారు.