గద్వాల మండలం రేకులపల్లికి చెందిన ఇద్దరు యువకులు గ్రామ సమీపంలోని కృష్ణా నదిలోకి శనివారం రాత్రికాల సమయంలో చేపల వేటకు వెళ్లారు. నదిలో వరద పెరగడంతో పుట్టి బోల్తా పడింది. అందులో ఉన్న చందు అనే యువకుడికి ఈత రాకపోవడంతో నదిలో గల్లంతయ్యాడు. మరో యువకుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం వరకు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.