కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కొత్తపేట సీఐ వీరయ్య శనివారం మధ్యాహ్నం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు చెప్పారు. మృతుడు ఆచూకీ తెలిసినవారు స్థానిక కొత్తపేట పోలీసులను సంప్రదించాలని ప్రకటనలో సీఐ వీరయ్య సూచించారు.