గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పర్యటించి పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.