పెద్దపులి సంచారంతో రాచర్ల ఫారం గ్రామానికి చెందిన గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొదట చిరుత పులిగా భావించిన అటవీశాఖ అధికారులు పాదముద్రల పరిశీలన అనంతరం పెద్దపులిగా శుక్రవారం నిర్ధారించారు. గ్రామస్తులు ఎవరు ఈ ప్రాంతాలలోకి పశువులను మేత కోసం పంపవద్దని అంతేకాకుండా ప్రజలు ఎవరు ఒంటరిగా రాచర్ల ఫారం సమీపంలోని పొలాల వైపు రావద్దని అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. పులి కదలికల పరిశీలన కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.