తాడిపత్రి మండలం బుగ్గ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే పనుల వద్ద సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన షెడ్ను రాంకో సిమెంట్ లోడ్ లారీ వేగంగా వెళ్లి ఢీకొట్టింది. షెడ్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ మస్తాన్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతుడు తాడిపత్రి అంబేడ్కర్ నగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.