జిల్లాలో 566గ్రామాల్లో ఉన్న 1,107అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, చిన్నారులకు పౌష్ఠికాహారం అందిస్తున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ తెలిపారు. మంచి సేవలు అందించిన మెట్లకుంటతండాకు చెందిన ఆయా లక్ష్మీకి రాష్ట్రస్థాయి అవార్డు రానున్నట్లు ఆమె వెల్లడించారు. అంగన్వాడీల సంఖ్య పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఉన్న కేంద్రాల ద్వారానే మంచి సేవలు అందించటమే లక్ష్యమన్నారు.