తెగిన రోడ్డు, ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ వద్ద ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో 3 గ్రామాల ప్రజలు, విద్యార్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వెళ్లడానికి వీలు లేకపోవడంతో పాఠశాలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని శుక్రవారం సాయంత్రం గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వర్షాలు మళ్లీ మొదలైతే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.